Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మ‌ద్యం మ‌త్తులో మార‌ణాయుధాల‌తో ఎమ్మెల్యే గౌతంరెడ్డి అనుచ‌రుల వీరంగం

  • నెల్లూరు జిల్లా చేజెర్ల పోలీస్ స్టేష‌న్‌లో ఘ‌ట‌న‌
  • పోలీస్ట్ స్టేష‌న్‌లోకి వ‌చ్చిన అనుచ‌రులు
  • తెల్ల‌రాయిని త‌ర‌లిస్తోన్న కేసులో నిన్న రాత్రి వైసీపీ కార్య‌క‌ర్త‌ల అరెస్టు
  • వారిని విడుద‌ల చేయాలంటూ హ‌ల్‌చ‌ల్‌
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గౌతంరెడ్డి అనుచ‌రులు మార‌ణాయుధాల‌తో వ‌చ్చి అల‌జ‌డి రేపిన ఘ‌ట‌న నెల్లూరు జిల్లా చేజెర్ల పోలీస్ స్టేష‌న్‌లో చోటు చేసుకుంది. అక్రమంగా తెల్ల‌రాయిని త‌ర‌లిస్తోన్న కేసులో నిన్న రాత్రి కొంద‌రు వైసీపీ కార్య‌క‌ర్త‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారిని విడుద‌ల చేయాలంటూ ఆత్మకూరు ఎమ్మెల్యే గౌతం రెడ్డి అనుచ‌రులు పోలీసుల‌తో వాగ్వివాదానికి దిగారు. ఈ క్ర‌మంలో అడ్డువ‌చ్చిన కానిస్టేబుల్‌పై దాడికి దిగారు. స‌ద‌రు ఎమ్మెల్యే అనుచ‌రులంద‌రూ మ‌ద్యం మ‌త్తులో ఉన్న‌ట్లు తెలుస్తోంది. పోలీసులు వైసీసీ కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద‌ల‌క‌పోవ‌డంతో ఎమ్మెల్యే అనుచ‌రులు చివ‌ర‌కు వెనుదిరిగారు.      
YSRCP
mla
nellore

More Telugu News